Share News

జ్వరాలు అదుపులోకి వచ్చేవరకు వైద్య శిబిరం

ABN , Publish Date - May 26 , 2024 | 12:15 AM

జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశిం చారు.

జ్వరాలు అదుపులోకి వచ్చేవరకు వైద్య శిబిరం

కొమరాడ: జ్వరాలు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశిం చారు. అంటివలసలో విష జ్వరాలు ప్రబలడంపై ఆంధ్రజ్యోతిలో శనివారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈ మేరకు శనివారం అంటివలస గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది చేపట్టిన ఫీవర్‌ సర్వేలో నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. అంతకు ముందు గుర్తించిన జ్వర పీడితుల ఆరోగ్య స్థితిని తెలుసు కున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జ్వరాలు అదుపులోకి వచ్చే వరకు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఎంపీడీవో మల్లిఖార్జునరావు తో కలిసి గ్రామంలో వీధులను సందర్శించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. దోమలు నివారణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గృహాలను సందర్శిం చి, జ్వరాలపై ఆరా తీశారు. గ్రామంలో జ్వర నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచు తూ పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య సేవలందించే విషయమై తక్షణమే స్పందించాల న్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శామ్యూల్‌, ఏఎంవో సూర్యనారాయ ణ, ఈవోపీఆర్‌డీ రాధాకృష్ణ, సీహెచ్‌వో బంగారుబాబు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:15 AM