Share News

దోమల నివారణకు చర్యలు: డీఎంవో

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:25 AM

దోమల నివారణకు ఏసీఎం ద్రావణాన్ని ఇంటింటికీ పిచికారీ చేయి స్తున్నామని మన్యం జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహనరావు తెలిపారు. కొమరాడ మండలంలోని పెదఖేర్జిలలో చేపడుతున్న మొదటి విడత స్ర్పేయింగ్‌ కార్యక్రమాన్ని ఆయన శనివారం పర్యవేక్షించారు. ఇంటింటికీ స్ర్పేయింగ్‌ పూర్తి చేసినట్లు సూచించే మార్కింగ్‌ను తప్పనిసరిగా వేయాలన్నారు. అలాగే స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహంలో స్ర్పేయింగ్‌ను ఆయన పరిశీలించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 43 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి విడత స్ర్పేయింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం చేపట్టిన ఐదుగ్రామాలతో కలిపి ఇప్పటికి 38 గ్రామాల్లో పూర్తి చేశామని తెలిపారు. వీటి తో పాటు అన్నిగ్రామాల్లో ఫీవర్‌ సర్వే, పోకల్‌ స్ర్పే, ఏఎల్‌వో, డ్రైడే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సంబం ధిత శాఖల సమన్వయంతో పనిచేసి మలేరియా, డెంగ్యూ, తదితర జ్వరాల నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌, సబ్‌ యూనిట్‌ అధికారి ధనుంజయరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, పీహెచ్‌ఎన్‌ విజయకుమారి, ఈవో సత్తిబాబు, వైద్య సిబ్బంది మంగమ్మ, రమేష్‌ ఉన్నారు.

దోమల నివారణకు చర్యలు: డీఎంవో

కొమరాడ:దోమల నివారణకు ఏసీఎం ద్రావణాన్ని ఇంటింటికీ పిచికారీ చేయి స్తున్నామని మన్యం జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహనరావు తెలిపారు. కొమరాడ మండలంలోని పెదఖేర్జిలలో చేపడుతున్న మొదటి విడత స్ర్పేయింగ్‌ కార్యక్రమాన్ని ఆయన శనివారం పర్యవేక్షించారు. ఇంటింటికీ స్ర్పేయింగ్‌ పూర్తి చేసినట్లు సూచించే మార్కింగ్‌ను తప్పనిసరిగా వేయాలన్నారు. అలాగే స్థానిక గిరిజన సంక్షేమ వసతి గృహంలో స్ర్పేయింగ్‌ను ఆయన పరిశీలించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 43 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి విడత స్ర్పేయింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. శనివారం చేపట్టిన ఐదుగ్రామాలతో కలిపి ఇప్పటికి 38 గ్రామాల్లో పూర్తి చేశామని తెలిపారు. వీటి తో పాటు అన్నిగ్రామాల్లో ఫీవర్‌ సర్వే, పోకల్‌ స్ర్పే, ఏఎల్‌వో, డ్రైడే కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ సంబం ధిత శాఖల సమన్వయంతో పనిచేసి మలేరియా, డెంగ్యూ, తదితర జ్వరాల నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో డాక్టర్‌ సీహెచ్‌ అరుణ్‌కుమార్‌, సబ్‌ యూనిట్‌ అధికారి ధనుంజయరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, పీహెచ్‌ఎన్‌ విజయకుమారి, ఈవో సత్తిబాబు, వైద్య సిబ్బంది మంగమ్మ, రమేష్‌ ఉన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:25 AM