Share News

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:03 AM

జిల్లావాసులు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు.

ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు
సమీక్షలో మాట్లాడుతున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పార్వతీపురం రూరల్‌: జిల్లావాసులు స్వేచ్ఛగా ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆదేశించారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగిం చుకునేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు సమస్యాత్మక గ్రామాలు, అతి సమస్యాత్మక గ్రామాలను సందర్శించాలని సిబ్బందికి సూచించారు. సరిహద్దు, చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సారా, మద్యం, నగదు అక్రమ తరలింపుపై నిఘా పెట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్‌, నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం మిస్సింగ్‌, చీటింగ్‌ కేసులు, సైబర్‌ నేరాలు ఇతర కేసులపై సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర పోలీస్‌ దళం , ఆర్‌పీఎఫ్‌ ఫోర్స్‌తో జిల్లాలో ఉన్న పోలీస్‌స్టేషన్ల అధికారులు, సిబ్బందితోనూ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకనబరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:03 AM