Share News

మలేరియా నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - May 23 , 2024 | 11:40 PM

మలేరి యా నియంత్రణలో భాగంగా మొదటి విడత దోమల మందు పిచికారీ చేస్తున్నామని జిల్లా మలే రియా అధికారి టి.జగన్మోహన్‌రావు తెలిపారు.

 మలేరియా నియంత్రణకు చర్యలు

పాచిపెంట: మలేరి యా నియంత్రణలో భాగంగా మొదటి విడత దోమల మందు పిచికారీ చేస్తున్నామని జిల్లా మలే రియా అధికారి టి.జగన్మోహన్‌రావు తెలిపారు. మండలంలోని పి.కోనవలస, పనసలపా డు గ్రామాల్లో చేపట్టిన స్ర్పేయింగ్‌ కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించారు. దోమల మందు పిచికారీ ఏ విధంగా చేస్తున్నారు.. నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నారో తనిఖీ చేశారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా స్ర్పేయింగ్‌ చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. స్ర్పేయింగ్‌ పూర్తయిన ఇళ్లకు మార్కింగ్‌ తప్పనిసరి అని ఆదేశించారు. జిల్లాలో ఏడు సబ్‌ యూనిట్ల పరిధిలో 401 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి విడత స్ర్పేయింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటిలో సాలూరు సబ్‌ యూనిట్‌ పరిధిలో 126 గ్రామాల్లో పిచికారీ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 11:40 PM