అటవీ పరిరక్షణకు చర్యలు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:55 PM
జిల్లాలో అడవుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖాధికారి ఎం.ప్రసూన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో బుధవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్‌కేపాడు, జేకేపాడు ప్రాంతాల్లో ఉన్న టేకు ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అడవుల్లో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల్లో విలువైన వృక్షజాతి మొక్కలు ఉన్నాయన్నారు. ఎవరైనా అక్రమంగా మొక్కలు, చెట్లు నరికినా, మంటలు పెట్టినా, మద్యం సేవించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్య క్రమంలో కురుపాం రేంజర్ ఫారెస్ట్ సిబ్బంది తిరుమల, రామారావు తదితరులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం: జిల్లాలో అడవుల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం మన్యం జిల్లా అటవీశాఖాధికారి ఎం.ప్రసూన తెలిపారు. గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో బుధవారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్‌కేపాడు, జేకేపాడు ప్రాంతాల్లో ఉన్న టేకు ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అడవుల్లో పలు చోట్ల హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవుల్లో విలువైన వృక్షజాతి మొక్కలు ఉన్నాయన్నారు. ఎవరైనా అక్రమంగా మొక్కలు, చెట్లు నరికినా, మంటలు పెట్టినా, మద్యం సేవించినా అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్య క్రమంలో కురుపాం రేంజర్ ఫారెస్ట్ సిబ్బంది తిరుమల, రామారావు తదితరులు పాల్గొన్నారు.