Share News

అర్తాంలో ఏనుగులు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:23 PM

అర్తాం అటవీ రేంజ్‌ పరిధిలో ఏడు ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అర్తాంలో ఏనుగులు
అర్తాంలో పంటలను నాశనం చేస్తున్న ఏనుగులు

కొమరాడ, జనవరి 8 : అర్తాం అటవీ రేంజ్‌ పరిధిలో ఏడు ఏనుగులు సంచరిస్తున్నాయి. దీంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం గజరాజులు పొలాల్లో తిరుగుతూ.. పంటలను నాశనం చేస్తున్నాయి. చేతికందొచ్చే పంటలు పాడైపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తక్షణమే పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి ఏనుగులను తరలించే చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:23 PM