Share News

తాపీ మేస్త్రి ఆత్మహత్య

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:24 AM

బొబ్బిలి రెడ్డికవీధికి చెందిన తాపీ మేస్ర్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తాపీ మేస్త్రి ఆత్మహత్య

బొబ్బిలి: బొబ్బిలి రెడ్డికవీధికి చెందిన తాపీ మేస్ర్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ కటకం సతీష్‌ కుమార్‌, స్థానికుల కథనం మేరకు.. చీపురుపల్లి మండలంలోని పల్లి గండ్రేడు గ్రామానికి చెందిన జామి అప్పారావు (40) సుమా రు ఐదేళ్ల నుంచి బొబ్బిలి రెడ్డికవీధిలో భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాస ముంటున్నాడు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వ్యసనాలకు బానిసగా మారిన అప్పారావు ఇంట్లో గ్యాస్‌స్టౌ, సిలెండరు అమ్మేసి మద్యం సేవించాడు. ఈ నేపథ్యంలో అప్పారావు తీరుకు విసుగు చెందిన భార్య ఆదిలక్ష్మి ఇద్దరి పిల్లలను తీసుకొని కన్నవారింటికి వెళ్లిపోయింది. దీంతో కలత చెందిన అప్పారావు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ ఐ శ్రీహరి సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 17 , 2024 | 12:24 AM