Share News

గంజాయి పట్టివేత

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:13 AM

మండల కేంద్రంలో గాంధీ బొమ్మ జంక్షన్‌ వద్ద గంజాయి తో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ ఆదివారం తెలిపారు

గంజాయి పట్టివేత

రామభద్రపురం: మండల కేంద్రంలో గాంధీ బొమ్మ జంక్షన్‌ వద్ద గంజాయి తో సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ జ్ఞాన ప్రసాద్‌ ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా నాగా యలంకకు చెందిన పెనమల పూర్ణ కిషోర్‌, విజయవాడ సిటీ రామవరప్పాడుకు చెందిన చీపురుపల్లి ప్రేమ్‌కుమార్‌ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయగా వెంబడించి వారిని సోదా చెయ్యగా వారి వద్ద 1.2 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. దీని విలువ సుమారు రూ.3వేలు ఉంటుందన్నారు. దీనిని వా రు ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి విజయవాడకు తీసుకువెళుతున్నట్లు తెలిపారన్నారు. ఈ కేసు విషయమై ఉప తహసీల్దార్‌, మరో మధ్యవర్తి సమక్షంలో వాంగ్మూలం రికార్డు చేసి గంజాయిని సీజ్‌ చేసి నిందితులపై కేసు నమోదు చేసి, బొబ్బిలి రూరల్‌ సీఐ తిరుమలరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jun 17 , 2024 | 12:13 AM