నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయండి
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:26 AM
నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేలా అందరూ సహకరిం చాలని టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ కోరారు.
రాజాం: నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేలా అందరూ సహకరిం చాలని టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ కోరారు. మంగళవారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావే శం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ ఉదయం పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగళం సభను విజయవంతం చేసినందుకు అభినందనలు తెలి పారు. టీడీపీ మండలాధ్యక్షుడు సుమల వెంకట మన్మథరావు, గురవాన నారాయ ణరావు, శ్రీనివాసరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, తదితరు లు పాల్గొన్నారు. బూరాడపేటకు చెందిన పలు వైసీపీ కుటుంబాలు శ్యాంపు రం క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరాయి. వారిని కోండ్రు ఆహ్వానించారు.