ఎస్పీగా మాధవరెడ్డి
ABN , Publish Date - Jul 13 , 2024 | 11:12 PM
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఎస్‌వీ మాధవరెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది.
ప్రస్తు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కాకినాడకు..
పార్వతీపురం, జూలై 13(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు కాకినాడ జిల్లాకు బదిలీ అయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో 2017 బ్యాచ్‌కు చెందిన ఎస్‌వీ మాధవరెడ్డిని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు రానున్నారు. త్వరలో మన్యం జిల్లా మూడో ఎస్పీగా మాధవరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.