Share News

భోజనం కోసం ఎదురుచూపు

ABN , Publish Date - May 12 , 2024 | 11:36 PM

పార్వతీపురంలో ఎన్నికల సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం భోజనాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

భోజనం కోసం ఎదురుచూపు
పార్వతీపురంలో భోజనాల కోసం ఎదురు చూస్తున్న ఎన్నికల సిబ్బంది

పార్వతీపురం టౌన్‌/సాలూరు, మే 12 : పార్వతీపురంలో ఎన్నికల సిబ్బంది ఆదివారం మధ్యాహ్నం భోజనాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. నియోజకవర్గ పరిధిలో ఉన్న వివిధ పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన ఎన్నికల సిబ్బంది ఉదయం 9 గంటలకే స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే వారికి అల్పాహారానికి సంబంధించి అధికారులు మమా అనిపించేశారు. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రం పోలింగ్‌ సిబ్బందికి భోజనాలు అందించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన పోలీసులు, సేవా సిబ్బందికి మధ్యాహ్నం 2 గంటల వరకు భోజనం అందించపోవడంతో పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా అందుబాటులో రాలేదు. సాలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా ఎన్నికల సిబ్బందికి సక్రమంగా భోజన ప్యాకెట్లు అందలేదు. దీంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - May 12 , 2024 | 11:36 PM