కోలగట్లను చూసి ఓటెయ్యాలంట!
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:49 PM
‘పార్టీని కాదు నన్ను చూసి ఓటేయండి. మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తా. నాలుగేళ్లుగా ఉద్యోగులకు అనేక విధాలుగా సహాయపడ్డాను. మీరు డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు, సకాలంలో జీతాలు వంటి అంశాలు నా పరిధిలో లేనివి. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు నాకు వ్యతిరేకంగా ఉండడం సరికాదు.’

కోలగట్లను చూసి ఓటెయ్యాలంట!
పార్టీని చూడొద్దని చెబుతున్న ఎమ్మెల్యే
జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతే కారణం!
ఆశ్చర్యపోతున్న అధికారపార్టీ శ్రేణులు, ఓటర్లు
వారం రోజులుగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలు
పోస్టల్ బ్యాలెట్లు కొల్లగొట్టేందుకు ముందస్తు వ్యూహం
వలంటీర్లు, ఉద్యోగ సంఘాలకు బహుమతులు
తాయిలాలపై నిఘా ఏదీ?ఏది?
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
‘పార్టీని కాదు నన్ను చూసి ఓటేయండి. మీకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తా. నాలుగేళ్లుగా ఉద్యోగులకు అనేక విధాలుగా సహాయపడ్డాను. మీరు డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు, సకాలంలో జీతాలు వంటి అంశాలు నా పరిధిలో లేనివి. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు నాకు వ్యతిరేకంగా ఉండడం సరికాదు.’
- ఉపాధ్యాయ సంఘాలతో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాటామంతీ
కోలగట్లకు వైసీపీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. కోలగట్లను జగన్ ‘అన్నా’ అని సంభోదించి గౌరవిస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 2014, 2019