పాఠశాలల్లో లిప్ బృందం అధ్యయనం
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:16 AM
మండలంలోని దేవుదళ కేజీబీవీ,సంకిలి హైస్కూల్‌లో సోమవారం 6,7,8 తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం పెంపు, ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యలపై మండలస్థాయి లెర్నంగ్ ఇంప్రూవ్‌మెంట్ (లిప్)బృందం తరగతుల వారీగా అధ్యయనం చేసింది. రేగిడి, వంగర మండలాలకు చెందిన మోనటరింగ్ బృంద సభ్యు లు జి.రవి, సీహెచ్ త్రిమూర్తి నాయుడు, హుస్సేన్, తిరుపతిరావు, ఎస్.దొరబాబుతో కూడిన బృందం పాఠశాలల్లో లిప్‌అమలుతీరు, తరగతి గదులకు వెళ్లి లిప్ రికార్డులు, బెస్, మిడ్‌లెవల్ పరీక్షపత్రాలు, విద్యార్థుల భాషాపరిజ్ఞానం పరిశీలిచింది. రికార్డులు, పాఠ్య ప్రణాళికలు తయారీ,తరగతుల వారీగా వెళ్లి విద్యార్ధుల రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ను ఆరాతీసింది.కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎం.లక్ష్మి, హెచ్‌ఎం రామినాయుడుతో సమీక్షించా రు.సంకిలిహైస్కూల్‌లో నిర్వహించిన తనిఖీలో ఎంఈవోవరప్రసాదరావు పాల్గొన్నారు.
రేగిడి: మండలంలోని దేవుదళ కేజీబీవీ,సంకిలి హైస్కూల్‌లో సోమవారం 6,7,8 తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యం పెంపు, ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యలపై మండలస్థాయి లెర్నంగ్ ఇంప్రూవ్‌మెంట్ (లిప్)బృందం తరగతుల వారీగా అధ్యయనం చేసింది. రేగిడి, వంగర మండలాలకు చెందిన మోనటరింగ్ బృంద సభ్యు లు జి.రవి, సీహెచ్ త్రిమూర్తి నాయుడు, హుస్సేన్, తిరుపతిరావు, ఎస్.దొరబాబుతో కూడిన బృందం పాఠశాలల్లో లిప్‌అమలుతీరు, తరగతి గదులకు వెళ్లి లిప్ రికార్డులు, బెస్, మిడ్‌లెవల్ పరీక్షపత్రాలు, విద్యార్థుల భాషాపరిజ్ఞానం పరిశీలిచింది. రికార్డులు, పాఠ్య ప్రణాళికలు తయారీ,తరగతుల వారీగా వెళ్లి విద్యార్ధుల రీడింగ్, రైటింగ్ స్కిల్స్ ను ఆరాతీసింది.కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎం.లక్ష్మి, హెచ్‌ఎం రామినాయుడుతో సమీక్షించా రు.సంకిలిహైస్కూల్‌లో నిర్వహించిన తనిఖీలో ఎంఈవోవరప్రసాదరావు పాల్గొన్నారు.
ఫతెర్లాం: తెర్లాం ఎమ్మార్సీలో 6,7,8 తరగతులకు అమలు చేస్తున్న అభ్యసనా భివృద్ధి కార్యక్రమం అమలుతీరు పరిశీలన బృంద సభ్యులతో ఎంఈవో సోమవారం సమావేశం నిర్వహించారు.మండలంలోని11 ఉన్నత,ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశా లల్లో ఎల్‌ఐపీలో అమలు చేస్తున్న వివిధ అంశాలను ఈ బృందం సోమవారం నుంచి పరిశీలించి ఉన్నతస్థాయి అధికారులకు నివేదిక అందించనుంది.కాగా సోమ వారం తెర్లాం జడ్పీ ఉన్నత, కూనాయవలస ఎంపీయూపీ పాఠశాలలో 6,7,8 తరగ తుల విద్యార్థులకు తెలుగు,ఆంగ్లం, గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రంలో అమలు చేస్తున్న ఎల్‌ఐపీ కార్యక్రమం అమలు తీరును బృందం పరిలించింది బృందంలో బాడంగి, తెర్లాం మండలాల ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు ఉన్నారు.