Share News

భార్యను చంపిన కేసులో యావజ్జీవ శిక్ష

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

భార్యను చంపిన కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

భార్యను చంపిన కేసులో యావజ్జీవ శిక్ష

సీతానగరం: భార్యను చంపిన కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండ లంలోని ఆర్‌.వెంకంపేట గ్రామానికి చెందిన జి.ఈశ్వరరావు 2018లో తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. దీనిపై అప్పటి సీఐ డీఎండీ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడు ఈశ్వరరావుకు యావజ్జీవ శిక్షను న్యాయాధికారి దామోదర్‌ గురువారం విధించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:25 AM