అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:05 AM
వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సాయమే కీలకమని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.

బొండపల్లి: వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సాయమే కీలకమని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం గరుడబిల్లి జంక్షన్ సమీపాన ఒక ఫంక్షన్ హాలులో కార్యకర్తలతో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీపై సమావేశం నిర్వహించారు. మండల మహిళా అధ్యక్షురాలు ముంజేటి పార్వతి, సీనియర్ నాయకులు బుచ్చిరాజు, శనపతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.