అరాచక పాలనను అంతం చేద్దాం
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:36 AM
టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు.

సీతంపేట: టీడీపీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. హడ్డుబంగి గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. మ్యానిఫెస్టోలోని సూపర్‌సిక్స్ అంశాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని, వైసీపీ అరాచక పాలనకు అంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సవర తోటముఖలింగం, ఆర్.రంగనాథం, బిడ్డిక నీలయ్య, గంట సుధ, బిడ్డిక ఆనందరావు, మూటక భరత్‌రాజ్, మండంగి కుమార్, బిడ్డిక విశ్వనాథం, బిడ్డిక ప్రవీణ్, పువ్వల భాస్కర్‌రావు, బిడ్డిక ఉమాకాంత్ పాల్గొన్నారు.