జాయింట్ కలెక్టర్‌గా కార్తీక్
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:30 AM
జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు.
జాయింట్ కలెక్టర్‌గా కార్తీక్
కలెక్టరేట్, జనవరి 28: జాయింట్ కలెక్టర్‌గా కొల్లాబత్తుల కార్తీక్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన కె.మయూర్‌అశోక్‌ను విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా నియమించారు. ఈయన మొదట్లో జిల్లాలో హౌసింగ్ జేసీ పనిచేశారు. ప్రభుత్వం జిల్లాలను విభజించడంతో జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. అప్పటి నుంచి జేసీగానే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు బదిలీపై వెళ్తున్నారు.