Share News

ఇదేం పని?

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:49 PM

విజయనగరం కార్పొరేషన్‌ ప్రజలకు వేసవి వచ్చిందంటే హడలే. తాగునీటికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో తాగునీటిని క్యాన్లలో తీసుకువెళ్తుంటారు.

ఇదేం పని?
కొత్తపేట నీళ్ల ట్యాంక్‌ నుంచి ప్రైవేట్‌ ట్యాంకర్లకు రక్షిత నీరు పడుతున్న దృశ్యం

ఇదేం పని?

ప్రైవేటు భవన నిర్మాణానికి రక్షిత నీరు తరలింపు

విజయనగరం కార్పొరేషన్‌ ప్రజలకు వేసవి వచ్చిందంటే హడలే. తాగునీటికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాల్లో తాగునీటిని క్యాన్లలో తీసుకువెళ్తుంటారు. రెండు రోజులకు ఒకసారే కుళాయి నీరు వస్తుంటుంది. ప్రస్తుతం వేసవి చాయలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాల్సిన అధికారులు నగరంలో ప్రైవేటు భవన నిర్మాణ పనులకు రక్షిత నీరు ఇచ్చేస్తున్నారు. నాయకుల ఒత్తిడితో కిమ్మనడం లేదు. కొద్దిరోజులుగా ఈ వ్యవహారం జరుగుతోంది. కొత్తపేట తదితర తాగునీటి ప్రధాన రిజర్వాయర్ల వద్ద నిత్యం ప్రైవేట్‌ యాజమాన్యాలకు చెందిన ట్యాంకర్లకు నీరు పడుతూ ఉన్నారు. ఇది చూస్తున్న స్థానికులు లోలోపల మథనపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వివాహాలు, ఇతర ఫంక్షన్‌లకు రక్షిత నీరు ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల కార్పొరేటర్లు, వైసీపీ నేతల పిఫార్సులతో తాగునీటిని అనధికారికంగా దుర్వినియోగం చేస్తున్నారు.

- (విజయనగరం-ఆంధ్రజ్యోతి)

Updated Date - Feb 20 , 2024 | 11:49 PM