జీవో-117 రద్దుచేయాలి
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:46 PM
ఐదేళ్లలో పరిష్కారానికి నోచుకోని అనేక విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం చొరవచూపాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు.ఈ మేరకు బుధ వారం స్థానిక ఎన్‌జీవో హోంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగి నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీటీఎఫ్ అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బొత్స పద్మావతి మాట్లా డుతూ విద్యారంగం ఉనికికి పెను ప్రమాదంగా తయారైన 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యను పరిరక్షించాలని, మూతపడిన పాఠశాలలను తెరిపించేందుకు కొత్త ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు లక్ష్మణరావు, కె.శ్రీను, ఆర్.రామకృష్ణ, ఎస్.ఎల్లయ్య పాల్గొన్నారు.

బొబ్బిలి:ఐదేళ్లలో పరిష్కారానికి నోచుకోని అనేక విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం చొరవచూపాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు.ఈ మేరకు బుధ వారం స్థానిక ఎన్‌జీవో హోంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగి నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఏపీటీఎఫ్ అకడమిక్ కన్వీనర్ జేసీ రాజు, రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు బొత్స పద్మావతి మాట్లా డుతూ విద్యారంగం ఉనికికి పెను ప్రమాదంగా తయారైన 117 జీవోను రద్దు చేసి ప్రాథమిక విద్యను పరిరక్షించాలని, మూతపడిన పాఠశాలలను తెరిపించేందుకు కొత్త ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు లక్ష్మణరావు, కె.శ్రీను, ఆర్.రామకృష్ణ, ఎస్.ఎల్లయ్య పాల్గొన్నారు.