Share News

రైతులకు న్యాయం జరిగేలా చూడాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:19 AM

రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారని, వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవా లని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు డిమాండ్‌ చేశారు.

రైతులకు న్యాయం జరిగేలా చూడాలి

గజపతినగరం: రైతులు పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారని, వారికి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవా లని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల్లో నిబంధనలు తొక్కి రైతుల వద్ద నుంచి క్వింటాకు 5 కిలోల చొప్పున దోచుకోవడం తగదన్నారు. తుఫాన్‌ కారణంగా ధాన్యం రంగు మారడంతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని దీంతో రైతు లకు ప్రభుత్వం ఇస్తున్న గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా కేంద్రాల్లో టీడీపీ సానుభూతిపరులకు ధాన్యం మిల్లుకు తరలించేం దుకు ఇబ్బందులు సృష్టిడం తగదన్నారు. మిల్లర్లు, అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్‌ ఎం.అరుణకుమారికి వినతిపత్రాన్న అందజేశారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం, బొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఎ.లక్ష్మునాయుడు, కోరాడ కృష్ణ, సీనియర్‌ నాయకులు పీవీవీ గోపాలరాజు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, బొండపల్లి మాజీ జడ్పీటీసీ బి.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:19 AM