Share News

టెన్త్‌ ఇన్విజిలేటర్ల జంబ్లింగ్‌

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:12 AM

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో 22 సీ సెంటర్లు ఉన్నాయి. కాగా ఈ పరీక్షల నిర్వహణకు తొలి విడతగా 518 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. అయితే ప్రస్తుతం వెనక్కి పిలిచి.. కొత్తవారిని ఆయా కేంద్రాల్లో నియమిస్తున్నారు.

 టెన్త్‌ ఇన్విజిలేటర్ల జంబ్లింగ్‌

సాలూరు రూరల్‌,మార్చి 21: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ చేస్తున్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో 22 సీ సెంటర్లు ఉన్నాయి. కాగా ఈ పరీక్షల నిర్వహణకు తొలి విడతగా 518 మంది ఇన్విజిలేటర్లును నియమించారు. అయితే ప్రస్తుతం వెనక్కి పిలిచి.. కొత్తవారిని ఆయా కేంద్రాల్లో నియమిస్తున్నారు. ఈ నెల 23 నుంచి జరిగే సైన్స్‌, సోషల్‌ పరీక్షలను కొత్త ఇన్విజిలేటర్లుతో నిర్వహించనున్నారు. రెండో విడత ఇన్విజిలేటర్లకు గురువారం మండలాల్లో సీఎంఆర్టీలు ఆర్డర్లు పంపిణీ చేశారు. తొలి విడత నియమించిన ఇన్విజిలేటర్లు గణిత పరీక్ష అనంతరం వారి పాఠశాలల్లో విధులకు వెళ్లనున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:12 AM