Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రాష్ట్ర పునర్నిర్మాణానికి చేతులు కలపాలి

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:14 AM

రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల నాయ కు లతో సమావేశం నిర్వహించారు

రాష్ట్ర పునర్నిర్మాణానికి చేతులు కలపాలి

రాజాం: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు చేతులు కలపాలని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోండ్రు మురళీమోహన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల నాయ కు లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం జగన్‌ దెబ్బ కొట్టారన్నారు. సీఎం జగన్‌పాలనలో రాష్ట్రం అంధకారంగా మారిందన్నారు. పేదలకు ఏడాది ఐదులక్షలు చొప్పున మొత్తం 25 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టి ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చి మాటతప్పా రన్నారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గృహ నిర్మాణం పేరుతో పేదలను అప్పుల పాలుచేశారన్నారు. గృహాలు నిర్మించకపోతే ఇచ్చిన స్థలం పట్టాలు రద్దుచేస్తా మని బెదిరించి పేదల చేత అప్పులు చేయించి ఇళ్లు నిర్మాణాలు చేపట్టారన్నారు. గురవాన నారాయణరావు, నాగళ్ల అప్పలనాయుడు, బెజ్జిపురపు త్రినాఽథ, దుప్పల పూడి శ్రీనివాసరావు, వంగ వెంకటరావు, పొన్నాడ భీమేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ సీఎం జగన్‌ దళిత ద్రోహి అని, దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతిశారని మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్జి కోండ్రు మురళీమోహన్‌ ఆరోపించారు. శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం వంగర మండలం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన 40 ఎస్టీ కుటుంబాలు, రేగిడి మండ లంలోని బాలకాయవలసకు చెందిన 30 మంది వైసీపీకి చెందిన యువకులు టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన రౌల బుచ్చిందొర, ఒమ్మి నందయ్య దొర, వంటల సింహాచలం దొర, బంటుపల్లి రామందొర, దంపల సత్యం దొర, బంటు పల్లి రమణందొర, సురేష్‌దొర టీడీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయ కులు పిన్నింటి మోహన్‌రావు, భీమవరం భాస్కరరావు, లక్షుభక్త కృష్ణమూర్తి, యలకల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:14 AM