Share News

రేపు పార్వతీపురంలో జాబ్‌మేళా

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:23 AM

పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్‌.వహీదా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రేపు పార్వతీపురంలో జాబ్‌మేళా

పార్వతీపురం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఈ నెల 14న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్‌.వహీదా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మసీ సంస్థ్థలో వంద ట్రైనీ ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నెలకు వేతనం రూ.15 వేలు చెల్లిస్తారని, 2019-2023 మధ్య బీఎస్సీ కెమిస్ర్టీ ఉత్తీర్ణులైన పురుష అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులు ఒరిజినల్స్‌, జిరాక్స్‌ కాపీ ధ్రువపత్రాలు, ఫొటోలతో జాబ్‌మేళాకు హాజరుకావాలన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:23 AM