10న పార్వతీపురంలో జాబ్‌మేళా
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:32 PM
పార్వతీపురం పట్టణ పరిధి కొత్తవలసలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ చలపతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పార్వతీపురం టౌన్, జూలై 5 : పార్వతీపురం పట్టణ పరిధి కొత్తవలసలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 10న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ చలపతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకు, డెక్కన్ కెమికల్స్, యాక్సెస్ బ్యాంకు, ఫాక్స్‌పాన్, ఆల్‌స్టామ్, డైకి అల్యూమినియం ఇండస్ట్రీ ఇండియా తదితర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఉదయం 9గంటలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ 95151 89844 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు.