Share News

నన్ను గెలిపించే బాధ్యత మీదే

ABN , Publish Date - Mar 11 , 2024 | 11:31 PM

‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సహకరించి నన్ను గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. నేను గెలిచిన తరువాత కచ్చితంగా మిమ్మల్ని గుర్తించి మీ కష్టాలు తీరుస్తా’ అని కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో అన్నట్లు తెలిసింది.

నన్ను గెలిపించే బాధ్యత మీదే

- ‘ఉపాధి’ క్షేత్ర సహాయకులతో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి రహస్య సమావేశం

జియ్యమ్మవలస, మార్చి 11: ‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా సహకరించి నన్ను గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలి. నేను గెలిచిన తరువాత కచ్చితంగా మిమ్మల్ని గుర్తించి మీ కష్టాలు తీరుస్తా’ అని కురుపాం నియోజకవర్గ శాసన సభ్యురాలు పాముల పుష్పశ్రీవాణి ఉపాధి హామీ క్షేత్ర సహాయకులతో అన్నట్లు తెలిసింది. ఆదివారం జియ్యమ్మవలస మండల క్షేత్ర సహాయకులతో తన స్వగృహంలో రహస్య సమావేశం ఏర్పాటు చేసిన ఆమె సోమవారం కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల క్షేత్ర సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ విషయం బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా క్షేత్ర సహాయకుల సెల్‌ ఫోన్లన్నీ తీసుకున్నారు. మీడియాను సైతం అనుమతించలేదు. ‘వచ్చే ఎన్నికల్లో పూర్తి సహాయ సహకారాలు అందించాలి. నా గెలుపు మీ భుజష్కందాలపై వేస్తున్నా. కచ్చితంగా గెలిపించాలి’ అని ఆమె కోరినట్లు సమాచారం.

Updated Date - Mar 11 , 2024 | 11:32 PM