Share News

శంబర పోలమాంబ ఉచిత దర్శనం లేనట్టేనా?

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:01 AM

శంబర వనం గుడి వద్ద పోలమాంబ దర్శనానికి బుధవారం భక్తుల నుంచి తప్పనిసరిగా రూ. 10 టిక్కెట్‌ను కొనిపించారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

శంబర పోలమాంబ ఉచిత దర్శనం లేనట్టేనా?
శంబరలో పోలమాంబ వనం గుడి

సాలూరు రూరల్‌,ఏప్రిల్‌ 3: శంబర వనం గుడి వద్ద పోలమాంబ దర్శనానికి బుధవారం భక్తుల నుంచి తప్పనిసరిగా రూ. 10 టిక్కెట్‌ను కొనిపించారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవంగా దేవాలయాల్లో ఉచిత దర్శనం తప్పనిసరిగా ఉండాలి. ఆ తర్వాత ప్రత్యేక దర్శనం, శీఘ్రదర్శనం, అంతరాలయ దర్శనం ఇలా దేవదాయ శాఖ టిక్కెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం.. కోర్కెలు తీర్చే కల్పవల్లిశంబర పోలమాంబ ఉచిత దర్శనానికి అవకాశం లేకుండా చేయడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. శంబరలో పది వారాల పాటు జాతర జరిగే సమయంలోనూ ఉచిత దర్శనం సౌకర్యం ఉండేది. ప్రస్తుతం ఉచిత దర్శనం లేకుండా కేవలం టిక్కెట్‌పై దర్శనం చేసుకోవాలనే పద్ధతి పాటించడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయమై దేవస్థానం ఉద్యోగి కృష్ణను వివరణ కోరగా.. తమ అధికారుల ఆదేశం ప్రకారం టిక్కెట్లు విక్రయిస్తున్నామన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:01 AM