Share News

ఇంత అరాచకమా?

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:04 AM

జర్నలిస్ట్‌లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటని రాజాం మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ర్యాలీ చేశారు.

ఇంత అరాచకమా?
రాజాంలో జర్నలిస్టుల ర్యాలీ

ఇంత అరాచకమా?

ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడికి జర్నలిస్టుల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

రాజాం రూరల్‌, ఫిబ్రవరి 19: జర్నలిస్ట్‌లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం దాడులను ప్రోత్సహించడం సిగ్గుచేటని రాజాం మీడియా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ సోమవారం ర్యాలీ చేశారు. ప్రాంతీయ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు భీంపల్లి తిరుపతిరావు ఆధ్వర్యంలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా జర్నలిస్టులు అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడిని తీవ్రంగా ఖండించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం తహసీల్దార్‌ కృష్ణంరాజుకు కూడా వినతినిచ్చారు. ఈసందర్భంగా సీనియర్‌ జర్నలిస్ట్‌లు శర్మ, నీలకంఠేశ్వర యాదవ్‌, తిరుపతిరావు మాట్లాడుతూ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నివర్గాలపైనా దాడులు పెరిగిపో యాయయన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలో జర్నలిస్ట్‌లు చంద్రశేఖర్‌, వెంకటరావు, తిరుమల, గణేష్‌, అన్నారావు, చందు, మురళి, గోవిందరావు, జగధీష్‌, శ్రీనివాసరావు, మోహన్‌, రాజేష్‌, ఉపేంద్ర, కిశోర్‌, మూర్తి, పురుషోత్తం, శ్రీధర్‌, వెంకటరావు, రామారావు తదితరులంతా పాల్గొన్నారు.

----------------------------

Updated Date - Feb 20 , 2024 | 12:04 AM