Share News

రహదారులపై సాగునీరు

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:11 AM

తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న సాగునీరు వృథాగా పోతోంది.

రహదారులపై సాగునీరు
సీతంపేట రోడ్డులోని సీఎల్‌ నాయుడు కాలనీలో చేరిన సాగునీరు

పాలకొండ, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న సాగునీరు వృథాగా పోతోంది. నిన్న మొన్నటి వరకు వర్షాభావంతో తోటపల్లి ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందని పరిస్థి తి. ప్రస్తుతం వరి కోతలు ముమ్మరం కావడంతో తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ పరిధిలోని వ్యవసాయ భూములకు సాగునీరు అవసరం లేదు. దీంతో సాగునీరు అంతా ఎడమ కాలువ పరిధిలోని 7, 8 బ్రాంచిల శివారు భూములకు అందుతుంది. పాలకొండ మండలం పరిధిలో పాలకొండ, సింగన్నవలస, వడమ తదితర గ్రామాలకు వెళ్లే కాలువ ఆక్రమణలకు గురికావడంతో సాగునీరు అంతా ప్రధాన రహదారిపైకి చేరుతోంది. దీంతో రహదారి మరమ్మతులకు గురవుతోంది. పాలకొండ-సీతంపేట రహదారిలో సాగునీరు ప్రవహించడంతో రహదారి గుంతల మయంగా మారుతోంది. అలాగే సీఎల్‌నాయుడు కాలనీ తదితర కాలనీల్లో వరదనీరు ప్రవేశించడంతో ఆయా కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాలకొండ పట్టణం, వడమ పరిధిలో కాలువలను ఆక్రమ ణలను తొలగించి సాగునీరు సద్వినియోగం అయ్యేలా నీటి పారుదల శాఖాధి కారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:11 AM