Share News

‘ఆదర్శ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:23 AM

సతివాడ ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎ.ఇందిరా ప్రియదర్శిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

‘ఆదర్శ’లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నెల్లిమర్ల: సతివాడ ఆదర్శ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియేట్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎ.ఇందిరా ప్రియదర్శిని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు మార్చి 28 నుంచి మే 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.200ను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150లను ప్రవేశ రుసుంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. పదో తరగతిలో పొందిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు ఉంటుందని చెప్పారు.

గజపతినగరం: స్థానిక ఆదర్శ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్‌ గెద్ద ఈశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి మే 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దరఖాస్తు రుసుం ఓసీ, బీసీలకు రూ.200 కాగా, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:23 AM