Share News

పిరిడి హైస్కూలులో డిప్యూటీ డీఈవో విచారణ

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:36 AM

పిరిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వ హణ తీరుపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు, ఇద్దరు ఎంఈఓలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపు వాసులు విచా రణ చేపట్టారు.

పిరిడి హైస్కూలులో డిప్యూటీ డీఈవో విచారణ

బొబ్బిలి: పిరిడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వ హణ తీరుపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణలపై బుధవారం డిప్యూటీ డీఈఓ కె.మోహనరావు, ఇద్దరు ఎంఈఓలు చల్లా లక్ష్మణరావు, గొట్టాపు వాసులు విచా రణ చేపట్టారు. తొలుత పాఠశాలలో హెచ్‌ఎం మధుసూదనరావు, సిబ్బంది, భోజన నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వహించి ఆరా తీశారు. వంటగ్యాస్‌ మధ్యలో అయిపోవడంతో రెండుసార్లు వంట వండాల్సి వచ్చిందని, ఆ కార ణంగానే తొలివిడతలో కొంతమంది విద్యార్థులకు భోజనం అందలేదని నిర్వాహ కులు వివరణ ఇచ్చారు. ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదని హెచ్‌ఎం సంజా యిషీ ఇచ్చారు. అనంతరం వంటలను, తయారుచేసిన భోజనాలను డిప్యూటీ డీ ఈవో పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనాన్ని విద్యా ర్థుల కు సరిపడా సక్రమంగా అందించాలని హెచ్‌ఎంను, భోజన నిర్వాహకులను ఆదే శించారు. మంగళవారం సుమారు 60 మంది విద్యార్థులకు భోజనం అందకపో యిన అంశానికి సంబంధించి రెండురోజుల్లోగా వివరణ ఇవ్వాలని హెచ్‌ఎంకు, నిర్వాహకురాలికి నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఈఓ తెలిపారు. నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Jun 27 , 2024 | 12:36 AM