15 నుంచి నీటి సరఫరాకు అంతరాయం
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:51 PM
కొర్లాం జంక్షన్ నుంచి గొట్లాం వరకూ నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపడుతుండడంతో కంటోన్మెంట్, బాలాజీనగర్, కొత్తఅగ్రహారం, వీటీఈ అగ్రహారం, ఉడా కాలనీలో ఈనెల 15 నుంచి 18 వరకూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. మల్లయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు 37, 38, 39, 40, 41, 43, 44, 46, 47 డివిజన్లలో నీటి సరఫరాకు ఆటంకం కలుతుండడంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ట్యాంకర్ల ద్వారా ఈ నెల 16 నుంచి 17 వరకూ నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.

విజయనగరం రింగురోడ్డు: కొర్లాం జంక్షన్ నుంచి గొట్లాం వరకూ నేషనల్ హైవే అథారిటీస్ ఆధ్వర్యంలో రోడ్డు పనులు చేపడుతుండడంతో కంటోన్మెంట్, బాలాజీనగర్, కొత్తఅగ్రహారం, వీటీఈ అగ్రహారం, ఉడా కాలనీలో ఈనెల 15 నుంచి 18 వరకూ నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని నగర పాలక సంస్థ కమిషనర్ ఎం. మల్లయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు 37, 38, 39, 40, 41, 43, 44, 46, 47 డివిజన్లలో నీటి సరఫరాకు ఆటంకం కలుతుండడంతో ఆ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ట్యాంకర్ల ద్వారా ఈ నెల 16 నుంచి 17 వరకూ నీటిని సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.