Share News

రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:39 AM

బొబ్బిలి పట్టణంలో రూ.16.18 కోట్లతో నిర్మించనున్న అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌(మోడల్‌ రైల్వేస్టేషన్‌) పనులకు సోమవారం ఉదయం ప్రధాని మోదీ శంకుస్థాపన నిర్వహించారు. దేశవ్యాప్తంగా 554 రైల్వేస్టేషన్లు, 1500 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌లకు ప్రధాని వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం
మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు

రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం

వర్చువల్‌ విధానంలో ప్రధాని మోదీ శంకుస్థాపన

బొబ్బిలి, ఫిబ్రవరి 26: బొబ్బిలి పట్టణంలో రూ.16.18 కోట్లతో నిర్మించనున్న అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌(మోడల్‌ రైల్వేస్టేషన్‌) పనులకు సోమవారం ఉదయం ప్రధాని మోదీ శంకుస్థాపన నిర్వహించారు. దేశవ్యాప్తంగా 554 రైల్వేస్టేషన్లు, 1500 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ పాస్‌లకు ప్రధాని వర్చువల్‌ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులోని భాగంగా బొబ్బిలి మల్లమ్మపేటలో శంకు స్థాపన కోసం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీరు డాక్టర్‌ ఎస్‌ఎంకె పట్నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, చీఫ్‌ ఇంజనీరు ఏకే పాండే, మున్సిపల్‌ చైర్మన్‌ సావు వెంకటమురళీకృష్ణారావు, బీజేపీ రాష్ట్రకార్యదర్శి రెడ్డి పావని, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి మరిశర్ల రామరావునాయుడు తదితరులు ప్రసంగించారు.

- శంకుస్థాపన కార్యక్రమం సుమారు రెండుగంటలు ఆలస్యమైంది. మోదీ శ్రీకారం చుట్టే సమయానికి వేదికపై ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. బీజేపీ నాయకులదే అంతా అన్నట్లు కార్యక్రమం కొనసాగింది.

చీపురుపల్లి: చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.ఈశ్వరరావు మాట్లాడారు. చీపురుపల్లి రైల్వే స్టేషన్‌తో పాటు పరిసరాల్లోని స్టేషన్ల అభివృద్ధి కోసం కేంద్రం రూ.21 కోట్లు కేటాయించిందన్నారు. కార్యక్రమంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ పాకలపాటి రఘురాజు, రైల్వే శాఖ అధికారులు కేఎస్‌ వర్మ, ఎన్‌వీఎల్‌ఎన్‌ రాజు, ఎన్‌ఎస్‌ఎన్‌ మూర్తి, బీజేపీ నాయకులు ఇప్పిలి నీలకంఠం, మన్నెపురి శ్రీనివాసరావు వైసీపీ నాయకుడు బెల్లాన వంశీకృష్ణ పాల్గొన్నారు.

కొత్తవలస: అమృత్‌ భారత్‌ రైల్వేస్టేషన్‌లో భాగంగా కొత్తవలస రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ కోసం కేంద్రప్రభుత్వం కేటాయించిన రూ.18 కోట్ల 72 లక్షలతో పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌కు వచ్చిన రైల్వే అధికారులకు స్థానికులు వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు, కొత్తవలస సర్పంచ్‌ మచ్చరామస్వామి, ఎంపీపీ నీలంశెట్టి గోపెమ్మ, రైల్వే అధికారులు సీఆర్‌దాస్‌, శివ, నరేష్‌, పార్వతీశం, జ్యోతిజేవి రావు, మాజీ ఎంపీపీ గొరపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 12:39 AM