Share News

ప్రతి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:13 AM

జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో  ఇండస్ట్రియల్‌ పార్క్‌
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌

గృహ నిర్మాణాలకు చర్యలు

కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, అక్టోబరు24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. ఇందుకోసం అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్షించారు. పాచిపెంటలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతాలను గుర్తించడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గృహ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూశాఖకు చెందిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఇకపై అలా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. త్వరలో జరగనున్న సాగునీటి సంఘాల ఎన్నికలకు నిధులు సమకూర్చుకోవాలని ఆదేశించారు. గ్రామసభల్లో రైతుల సమస్యలు తెలుసుకోవాలని, కోర్టు కేసులు లేకుండా భూ వివాదాలు పరిష్కరించాలని పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, పార్వతీపురం, సీతంపేట సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాత్సవ, యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:13 AM