Share News

మూడేళ్లలో.. 23 శాతమే..

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:36 PM

వెంగళరాయ సాగర్‌ (వీఆర్‌ఎస్‌) జలాశయ ఆధునికీకరణ కలగానే మిగులుతుంది. జైకా నిధులు సుమారు రూ.63 కోట్లతో వీఆర్‌ఎస్‌ రూపురేఖలు మారు తాయని,కాలువల ద్వారా శివారు భూములకు పూర్తిస్థాయిలో సా

మూడేళ్లలో.. 23 శాతమే..
వీఆర్‌ఎస్‌ జలాశయం

జైకా నిధులున్నా.. పనులు పూర్తికాని వైనం

సకాలంలో బిల్లులు మంజూరు చేయని వైసీపీ

కాలువల నిర్వహణను పట్టించుకోని ప్రభుత్వం

ఏటా శివారు భూములకు అందని సాగునీరు

మూడు మండలాల రైతులకు తప్పని ఇబ్బందులు

మక్కువ: వెంగళరాయ సాగర్‌ (వీఆర్‌ఎస్‌) జలాశయ ఆధునికీకరణ కలగానే మిగులుతుంది. జైకా నిధులు సుమారు రూ.63 కోట్లతో వీఆర్‌ఎస్‌ రూపురేఖలు మారు తాయని,కాలువల ద్వారా శివారు భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందని ఆశపడిన రైతులకు నిరాశే మిగి లింది. నిధులున్నా.. పనులు జరిపించడంలో వైసీపీ సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో ఏటా మూడు మండలాల పరిధిలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వరుణు డిపైనే ఆధారపడి సాగు చేసుకోవాల్సి వస్తోంది.

- వాస్తవంగా మక్కువ, సీతానగరం, విజయనగరం జిల్లా బొబ్బిలి మండలాల పరిధిలోని 24,700 ఎకరాలకు వీఆర్‌ఎస్‌ కుడి, ఎడుమ ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందిం చాల్సి ఉంది. అయితే కాలువల నిర్వహణను వైసీపీ సర్కారు గాలికొదిలేసింది. దీంతో కేవలం 15 వేల ఎకరాల లోపే నీరు చేరుతుంది. శివారు భూములకు పూర్తిస్థాయిలో నీరు చేరడం లేదు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో వీఆర్‌ఎస్‌ నుంచి నీరు విడిచిపెట్టిన సమయంలో రైతులే శ్రమదానంతో కాలువల్లో పూడికలు, వ్యర్థాలను తొలగించుకోవాల్సి వస్తోంది. ఇటీవల ఉపాధి హామీ వేతనదారులతో కొన్ని చోట్ల కాలువల్లో పేరుకు పోయిన తొలగించారు. అయినా ఏ మాత్రం ప్రయో జనం లేకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. సుమారు నాలుగు సంవత్సరాల నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీనిపై స్పందించే వారే కరువయ్యారు. తమది రైతు ప్రభుత్వమని చెప్పిన వైసీపీ ప్రతినిధులు ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో ఏటా రైతులు పంటలను నష్టపోవాల్సి వస్తోంది.

- జలాశయం చుట్టూ గట్లు, రక్షణ గోడలు నిర్మించాల్సి ఉంది. రెగ్యులేటర్‌ లీక్‌లు అరికట్టాలి. కాలువల లైనింగ్‌, తూములు, షట్టర్లు కోతలకు గురైన చోట్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. అయితే జైకా నిధులు మంజూరైన మూడేళ్లలో సుమారు రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 23 శాతం మేర ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. వాటికి కూడా బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులన్నీ మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని మూడు మండలాల రైతులు కోరుతున్నారు.

పూర్తిస్థాయిలో అందిస్తాం

జైకా నిధులతో వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టాం. అయితే సకాలంలో బిల్లులు మంజూరు కాకపో వడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గం చూస్తాం. పనులు పునఃప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఈ ఖరీఫ్‌ నాటికి వీఆర్‌ఎస్‌ పరిధిలో రైతుల భూములకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తాం.

- రాజశేఖర్‌, ఏఈ, వీఆర్‌ఎస్‌

Updated Date - Jun 12 , 2024 | 11:36 PM