Share News

ఆ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదింటి వరకే...

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:30 PM

జిల్లాలో మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటింగ్‌ సమయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవంగా అన్నిచోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. కానీ జిల్లాలో మాత్రం పార్వతీపురం మినహా సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓటింగ్‌ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.

 ఆ నియోజకవర్గాల్లో  సాయంత్రం ఐదింటి వరకే...

పార్వతీపురం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మే 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓటింగ్‌ సమయాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది. వాస్తవంగా అన్నిచోట్లా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగుతుంది. కానీ జిల్లాలో మాత్రం పార్వతీపురం మినహా సాలూరు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే ఓటింగ్‌ నిర్వహించాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు పెద్దగా లేకపోయినప్పటికీ ఏజెన్సీ మండలాలు అత్యధికంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయా చోట్ల పోలింగ్‌ పూర్తయిన అనంతరం ఈవీఎంల తరలింపు తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు చాలా సమయం పట్టనుంది. గతే ఎన్నికల్లో కూడా పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా ‘మన్యం’లో అనేక గిరి శిఖర గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలకు నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ కూడా అందని పరిస్థితి. చాలా గ్రామాలకు రహదారులు కూడా లేవు. వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలింగ్‌ సమయాన్ని తగ్గించినట్లు సమాచారం.

Updated Date - Apr 19 , 2024 | 11:30 PM