Share News

విద్యా ప్రమాణాలు మెరుగు పరచండి

ABN , Publish Date - Feb 25 , 2024 | 12:24 AM

విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ అన్నారు.

  విద్యా ప్రమాణాలు మెరుగు పరచండి

బొండపల్లి: విద్యా ప్రమాణాల మెరుగుకు ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. రోల్లవాక ఎంపీపీ పాఠశాలతో పాటు గొట్లాంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం తనిఖీచేశారు. రోళ్లవాక పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం గొట్లాంలో మధ్యాహ్న భోజన పథకం ద్వారా అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ పక్కాగా అమలుచేయాలని, ఎండీఎంను పర్యవేక్షించాలని హెచ్‌ఎంలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో-2 అల్లు వెంకటరమణ, జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం శ్రీరామాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 12:24 AM