Share News

ఏటీఎం కార్డు చోరీ కేసులో జైలుశిక్ష

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:15 AM

జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు సేష్టన్‌ పరి ధిలో 2022లో ఏటీఎం కార్డు మార్చి ఓ వ్యక్తిని మోసగించిన కేసులో నిందితు నికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ అడిషినల్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బి.రమ్య తీర్పును వెల్లడించినట్లు వన్‌టౌన్‌ సి.ఐ. వెంకట రావు బుధవారం తెలిపారు.

ఏటీఎం కార్డు చోరీ కేసులో జైలుశిక్ష

విజయనగరం (క్రైమ్‌): జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌ పోలీసు సేష్టన్‌ పరి ధిలో 2022లో ఏటీఎం కార్డు మార్చి ఓ వ్యక్తిని మోసగించిన కేసులో నిందితు నికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ అడిషినల్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బి.రమ్య తీర్పును వెల్లడించినట్లు వన్‌టౌన్‌ సి.ఐ. వెంకట రావు బుధవారం తెలిపారు. 2022 జనవరి 24న ఎస్‌.బి.ఐ. మెయిన్‌ బ్రాంచ్‌ సమీపంలోని ఏటీఎం కేంద్రంలో మెంటాడ మండలం జయతి గ్రామానికి చెందిన ఽథాట్రాజు మల్లిస్వామి నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఆ వ్యక్తి మల్లిస్వామి చెప్పిన పిన్‌ నెంబర్‌ గుర్తుపెట్టుకుని నగదు విత్‌డ్రా చేసుకున్న తరువాత అసలు ఏటీఎం కార్డుకు బదులు వేరే కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. నిందితుడు వేర్వేరు ఏటీఎం కేంద్రాల్లో మల్లిస్వామి ఖాతా నుంచి 5 విడతలుగా రూ.86వేల 750 నగదును డ్రా చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గుంటూరుకు చెందిన కె.విద్యాసాగర్‌గా గుర్తించి అదు పులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించాడు. కోర్టులో నేరారోపణలు రుజువు కావటంతో నిందితుడు విద్యాసాగర్‌కు న్యాయాధికారి జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకటరావు తెలిపారు.

1111

Updated Date - Mar 28 , 2024 | 12:15 AM