Share News

నాణ్యమైన సరుకులు దిగుమతి చేసుకోండి

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:46 PM

జీసీసీ గోదాములకు ముందు వచ్చిన సరుకులను డీఆర్‌ డిపోలు, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు పంపివేయాలని, నాణ్యమైన సరుకు లనే గోదాముల్లో దిగుమతి చేసుకోవాలని పార్వతీపురం గిరిజన సహకార సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ యు.మహేంద్రకుమార్‌ తెలిపారు.

నాణ్యమైన సరుకులు దిగుమతి చేసుకోండి

గుమ్మలక్ష్మీపురం: జీసీసీ గోదాములకు ముందు వచ్చిన సరుకులను డీఆర్‌ డిపోలు, గిరిజన సంక్షేమ వసతిగృహాలకు పంపివేయాలని, నాణ్యమైన సరుకు లనే గోదాముల్లో దిగుమతి చేసుకోవాలని పార్వతీపురం గిరిజన సహకార సంస్థ డివిజనల్‌ మేనేజర్‌ యు.మహేంద్రకుమార్‌ తెలిపారు. బుధవారం గుమ్మలక్ష్మీపు రం జీసీసీ గోదామును పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న గోదాముల్లో నాణ్యమైన నిత్యావసర సరుకులను మాత్రమే ఉంచాలని తెలిపారు.ఆయన వెంట జీసీసీ మేనేజర్‌ కృష్ణ ప్రసాదరావు, గోదాము సూపరింటెండెంట్‌ సాంబశివరావు ఉన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 11:46 PM