Share News

అక్రమ లేఅవుట్లను తొలగించాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:12 AM

మండలంలోని అడ్డాపుశీల ప్రాం తంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించా లని ఎమ్మెల్యే విజయచంద్ర అధికారులను ఆదేశించారు.

 అక్రమ లేఅవుట్లను తొలగించాలి

పార్వతీపురం రూరల్‌: మండలంలోని అడ్డాపుశీల ప్రాం తంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించా లని ఎమ్మెల్యే విజయచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళశారం ఆయన అక్ర మ లేఅవుట్లను పరిశీలించారు. వీటిపై తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలా లను కాపాడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయ కులు గొట్టాపు వెంకటనాయుడు, బోనుదేవి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలపై వినతుల స్వీకరణ

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: స్థానిక టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మంగళవారం ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్‌ ద్వారా ఆదేశించారు. టీడీపీ నాయకులు బార్నాల సీతారాం, గొట్టాపు వెంకట నా యుడు, బోను దేవిచంద్రమౌళి, వేణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:12 AM