Share News

అక్కడ గెలిస్తే... మంత్రి పదవి ఖాయం!

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:00 AM

చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాయకులను పలుమార్లు ముఖ్య పదవులు వరించాయి. ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఐదుగురు నాయకులు కేబినెట్‌లో స్థానం సంపాదించి... రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు.

అక్కడ గెలిస్తే... మంత్రి పదవి ఖాయం!

- ఇదీ చీపురుపల్లి ప్రత్యేకత

(చీపురుపల్లి)

చీపురుపల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాయకులను పలుమార్లు ముఖ్య పదవులు వరించాయి. ఇక్కడి నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఐదుగురు నాయకులు కేబినెట్‌లో స్థానం సంపాదించి... రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. కేబినెట్‌లో అవకాశం కోల్పోయిన మరో నాయకుడు ప్రభుత్వ విప్‌ పదవిని చేపట్టి... రాజకీయాల పరంగా చీపురుపల్లికి ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించారు. 1978 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల తరపున గెలిచిన ఐదుగురు నాయకులకు ఉన్నత పదవులు దక్కాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవిం చక ముందు 1978లో చీపు రుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన చి గిలపల్లి శ్యామలరావు తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. ఆయన కేబి నెట్‌లో శ్యామలరావు సమాచార శాఖ మంత్రిగా పని చేశారు. రాజ కీయంగా ప్రాధాన్యం ఉన్న చీపురుపల్లికి మంత్రి పదవులు రావడం ఆయనతోనే ప్రారంభమైంది. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భ వించాక... 1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆప్పట్లో చీపురుపల్లి నుంచి గెలిచిన త్రిపురాన వెంకటరత్నంను ఆయన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆమె స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత 1994, 99లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గద్దే బాబూరావుకు మంత్రి వర్గంలో చోటు దక్కక పోయినప్పటికీ ప్రభుత్వ విప్‌ పదవి లభించింది. 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన బొత్స సత్యనారాయణ.... వైఎస్‌ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పదవిని చేపట్టారు. 2009లో రెండోసారి గెలిచిన ఆయన పంచాయతీ రాజ్‌ మంత్రిగా మరోమారు కేబినెట్‌లో స్థానం సంపాదిం చుకున్నారు. ఆ తరువాత 2014లో చీపురుపల్లిలో దేశం జెం డాను తిరిగి రెపరెపలాడించిన కిమిడి మృణాళినికి ముఖ్యమం త్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్‌, గృహ నిర్మాణ శాఖలను అప్పగించారు. ఈ రకంగా చీపు రుపల్లి నుంచి గెలిచిన నాయకులకు రాష్ట్ర రాజకీయాల్లోనూ... ముఖ్యంగా మం త్రివర్గాల్లో స్థానం దక్కుతోంది. ప్రభుత్వం ఏదైనా ఇలా మంత్రి వర్గ కూర్పులో చీపురుపల్లికి ప్రాధాన్యం ఇస్తుడండంతో... ఏ పార్టీకి చెందిన వారైనా ఇక్కడి నుంచి పోటీకి ఉత్సాహం చూపిస్తారనే మాట ఉంది.

Updated Date - Apr 27 , 2024 | 12:00 AM