రైతులకు ఉపయోగపడే పనులు గుర్తించండి: పీడీ
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:20 AM
ఉపాధిపథకంలో రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించా లని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాపరమేశ్వరి కోరారు. సోమవారం ఎల్.కోటలో ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధిపనుల గుర్తింపులో కొత్తదనంఉండాలని, రైతులకు ఉపయోగ పడే ఫీల్డ్,ఫీడర్ చానళ్ల పనులుచేయాలని, పంటపొలాల్లో గుంతల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి పనులను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్‌మెన్ అన్నపూర్ణ, ఏపీడీ శారదాదేవి, ఎంపీడీవో కె.రూపేష్, ఏపీవో విజయలక్ష్మి, ఏఈ ఉమామహేశ్వరరావు, పీఆర్ జేఈ వీరలక్ష్మి, ఎస్సార్పీ మాదవ్ పాల్గొన్నారు.
లక్కవరపుకోట:ఉపాధిపథకంలో రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించా లని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాపరమేశ్వరి కోరారు. సోమవారం ఎల్.కోటలో ఉపాధిహామీ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధిపనుల గుర్తింపులో కొత్తదనంఉండాలని, రైతులకు ఉపయోగ పడే ఫీల్డ్,ఫీడర్ చానళ్ల పనులుచేయాలని, పంటపొలాల్లో గుంతల నిర్మాణం, మొక్కల పెంపకం వంటి పనులను చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్‌మెన్ అన్నపూర్ణ, ఏపీడీ శారదాదేవి, ఎంపీడీవో కె.రూపేష్, ఏపీవో విజయలక్ష్మి, ఏఈ ఉమామహేశ్వరరావు, పీఆర్ జేఈ వీరలక్ష్మి, ఎస్సార్పీ మాదవ్ పాల్గొన్నారు.