Share News

ఎస్టీలుగా గుర్తించండి

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:59 PM

తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని పోర్జా (పైడి) కులస్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం సీతంపేట వారపు సంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేశారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు.

  ఎస్టీలుగా గుర్తించండి
ఎస్టీలుగా గుర్తించాలని ధర్నా చేస్తున్న పోర్జా కులస్థులు

ఐటీడీఏ ఎదుట ధర్నా

సీతంపేట: తమను ఎస్టీలుగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు అందించాలని పోర్జా (పైడి) కులస్థులు డిమాండ్‌ చేశారు. సోమవారం సీతంపేట వారపు సంత నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా చేశారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గేదెల చిరంజీవి, గొర్లె జీవన్‌కుమార్‌ మాట్లా డుతూ... 1950లో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ ప్రాప్తికి పోర్జా పైడి కులస్థులను పీవీటీజీలుగా గుర్తించినట్లు చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదన్నారు. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు తమకు అందడం లేదని, తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని అనంతరం ఐటీడీఏ పీవో కల్పనాకుమారికి వినతిపత్రం అందించారు. కాగా ధర్నా సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ నిరసనలో సంఘ నాయకులు రాజారావు, నాగరాజు, దుర్యోదన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:59 PM