Share News

ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు

ABN , Publish Date - May 22 , 2024 | 11:50 PM

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్‌ చెప్పారు. బుధవారం మండలంలోని నరవ, గంట్యాడ గ్రామాల్లో ప్రత్యేక అవసరాల గల పిల్లల గుర్తింపు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదం డ్రులకు సూచించారు. ప్రతి గ్రామంలోని ఒకటి నుంచి 14 సంవత్సరాలు వయస్సు గల ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారికి విద్యా బోధనతోపాటు ఫిజియో థెరఫీ చేయించడం, అంధులు, చెవిటి, మూగ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 680 మంది పిల్లలును గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకూ 272 మందిని గుర్తించినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో ఐఆర్‌ఈ టీచర్లు సర్వే చేస్తున్నారని , మరో పది రోజుల పాటు సర్వే జరుగుతుందన్నారు. కార్యక్రమంలోని ఎంఈవో విజయ లక్ష్మి, ఐఆర్‌టీ టీచర్లు చక్క రమేష్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.

ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు
పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డీఈవో ప్రేమకుమార్‌ :

గంట్యాడ: జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమకుమార్‌ చెప్పారు. బుధవారం మండలంలోని నరవ, గంట్యాడ గ్రామాల్లో ప్రత్యేక అవసరాల గల పిల్లల గుర్తింపు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక అవసరాల పిల్లలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదం డ్రులకు సూచించారు. ప్రతి గ్రామంలోని ఒకటి నుంచి 14 సంవత్సరాలు వయస్సు గల ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి వారికి విద్యా బోధనతోపాటు ఫిజియో థెరఫీ చేయించడం, అంధులు, చెవిటి, మూగ పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం భవిత కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 680 మంది పిల్లలును గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకూ 272 మందిని గుర్తించినట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో ఐఆర్‌ఈ టీచర్లు సర్వే చేస్తున్నారని , మరో పది రోజుల పాటు సర్వే జరుగుతుందన్నారు. కార్యక్రమంలోని ఎంఈవో విజయ లక్ష్మి, ఐఆర్‌టీ టీచర్లు చక్క రమేష్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2024 | 11:50 PM