Share News

ప్రమాదమని తెలిసినా..

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:17 PM

ఇది సీతంపేట మండలం రామానగరంగూడలో పరిస్థితి. విద్యుత్‌ సర్వీస్‌ వైర్లకు ఎందుకిలా వాటర్‌ బాటిల్‌ వేలాడదీశారనుకుంటున్నారా? గట్టిగా గాలులు వీస్తే.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా ఉండాలనే.. గిరిజనులు ప్రాణాలకు తెగించి ఈ విధంగా చేయాల్సి వస్తోంది.

ప్రమాదమని తెలిసినా..
రామానగరంగూడలో సర్వీస్‌ వైరు కదలకుండా నీటి బాటిల్‌ ఏర్పాటు చేసిన దృశ్యం

ఇది సీతంపేట మండలం రామానగరంగూడలో పరిస్థితి. విద్యుత్‌ సర్వీస్‌ వైర్లకు ఎందుకిలా వాటర్‌ బాటిల్‌ వేలాడదీశారనుకుంటున్నారా? గట్టిగా గాలులు వీస్తే.. విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా ఉండాలనే.. గిరిజనులు ప్రాణాలకు తెగించి ఈ విధంగా చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఆ వైర్లకు రాళ్లు, మరికొన్నిచోట్ల వాటర్‌ బాటిళ్లు వేలాడదీస్తున్నారు. వాస్తవంగా ఈ గిరిశిఖర గ్రామంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారి ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన సర్వీస్‌ వైర్లు కలవకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ వారు పట్టించుకోకపోవడంతో ప్రమాదమని తెలిసినా.. గిరిజనులే ఇలా చేయాల్సి వస్తోంది. అసలు మారుమూల ప్రాంతాల్లో సక్రమంగా సర్వీస్‌ వైర్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈదురుగాలులు సంభవించేటప్పుడు తరచూ అవి తెగిపోతున్నాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

- సీతంపేట

Updated Date - Jun 08 , 2024 | 11:17 PM