Share News

మానవ అక్రమ రవాణా నేరం

ABN , Publish Date - May 26 , 2024 | 12:22 AM

మానవ అక్రమ రవాణా చట్టరీత్య నేరమని జిల్లా సివిల్‌ న్యాయాధికారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.విజయకల్యాణి తెలిపారు.

మానవ అక్రమ రవాణా నేరం

విజయనగరం (ఆంధ్రజ్యోతి): మానవ అక్రమ రవాణా చట్టరీత్య నేరమని జిల్లా సివిల్‌ న్యాయాధికారి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.విజయకల్యాణి తెలిపారు. శనివారం విజయనగరంలో మానవ అక్రమ రవాణా అనే అంశంపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెట్టిచాకిరి, అవయవాలు, మత్తుపదార్ధాలు, వ్యభిచారం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగించేందుకు బాల, బాలికలను వినియోగించడం చట్టవ్యతిరేకమన్నారు. కార్యక్రమంలో పీఎల్‌ఏపీయూఎస్‌ న్యాయాధికారి దుర్గయ్య, దిశా సీఐ బి.నాగేశ్వరరావు, స్త్రీశిశు సంక్షేమ శాఖ, వన్‌స్టాప్‌ సెంటర్‌ అధికారి సాయివిజయలక్ష్మి, మెప్మా, స్త్రీశిశు సంక్షేమ శాఖ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:22 AM