Share News

పోరుబాటలో ఆశావర్కర్లు

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:39 PM

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న ఆశావర్కర్లు చలో విజయవాడకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆరోగ్య కేంద్రాల్లోని వైధ్యాధికారులకు గురువారం రాతపూర్వకంగా తెలియజేశారు.

పోరుబాటలో ఆశావర్కర్లు
వైధ్యాధికారులకు వినతిపత్రం అందచేస్తున్న ఆశావర్కర్లు

పోరుబాటలో ఆశావర్కర్లు

8న చలో విజయవాడ

విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఫిబ్రవరి 1: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 8న ఆశావర్కర్లు చలో విజయవాడకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆరోగ్య కేంద్రాల్లోని వైధ్యాధికారులకు గురువారం రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల యూనియన్‌ నాయకులు మహాలక్ష్మీ, రాజేశ్వరి, అప్పయ్యమ్మలు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చెయ్యాలని, వేతనంతో కూడిన మెటర్నటీ లీవ్‌లతో పాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. రూ.10 లక్షల బీమా సౌకర్యం, ఖాళీల భర్తీ, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్‌, హెల్త్‌సెక్రటరీ, స్టాఫ్‌ నర్స్‌ నియామకాల్లో ఆశాలకు వెయిటేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్బన్‌లో ప్రతి 2000 నుంచి 2500 జనభాకు ఒక ఆశాను నియమించాలని, సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని కోరారు.

Updated Date - Feb 01 , 2024 | 11:39 PM