Share News

రిమాండ్‌ ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:52 PM

సబ్‌జైల్లో ఉన్న రిమాండ్‌ ఖైదీల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. పా లకొండ సబ్‌ జైలును మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్‌ పీఎస్‌వీబీ కృష్ణ సాయితేజ్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు.

రిమాండ్‌ ఖైదీల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
సబ్‌జైలులో సూచనలిస్తున్న సన్యాసినాయుడు:

పాలకొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సబ్‌జైల్లో ఉన్న రిమాండ్‌ ఖైదీల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు అన్నారు. పా లకొండ సబ్‌ జైలును మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఇన్‌చార్జి చైర్మన్‌ పీఎస్‌వీబీ కృష్ణ సాయితేజ్‌తో కలిసి ఆయన శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన కిచెన్‌, స్టోర్‌రూమ్‌ంలో ఉన్న సరుకులను పరిశీలించారు. ఖైదీలకు ఇస్తున్న ఆహారాన్ని నాణ్యమైన సరుకులతో తయారు చేసి అందించాలని జైలు సూపరింటెండెంట్‌ బి.జోగులుకు సూచించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జైల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయా.. ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మీరు బెయిల్‌ కోసం న్యాయవాదిని కోరితే లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ లాయర్‌తో మాట్లా డాలని సూచించారు.పరిశీలనలో న్యాయవాదులు గొర్రెల సత్యం నాయుడు, వెంకటేశ్వరరావు, శామ్యూల్‌, జైలు హెడ్‌వార్డర్స్‌ పి.చంద్ర రావు, విజయ్‌కుమార్‌, హేమసుందర్‌, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:52 PM