Share News

మొదలయ్యాయి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:12 AM

విజ యనగరం నియోజకవర్గానికి సంబం ధించి తొలి రోజు గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

మొదలయ్యాయి

- తొలి రోజు స్వల్ప సంఖ్యలో నామినేషన్లు

విజయనగరం రూరల్‌: విజ యనగరం నియోజకవర్గానికి సంబం ధించి తొలి రోజు గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. పి.కరుణా కర్‌ (సమాజ్‌వాదీ పార్టీ), మండల శ్రీని వాసరావు (స్వతంత్ర అభ్యర్ధి) నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నామినేషన్లను ఆర్‌ఓ కార్తీక్‌ స్వీకరించారు. రెండో రోజు శుక్రవారం ఏకాదశి... మంచి రోజు కావడంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

బొబ్బిలిలో..

బొబ్బిలి: బొబ్బిలి అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు గురువారం తొలిరోజు ఒక అభ్యర్ది రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ముగడ వెంకటరమణ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒకటి, ఇండిపెండెంట్‌గా మరొక నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ ఎ.సాయిశ్రీకి అందజేశారు. డీఎస్పీ శ్రీనివా సరావు, సీఐలు మలిరెడ్డి నాగేశ్వరరావు, తిరుమలరావుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

ఎమ్మెల్యే బడ్డుకొండ...

నెల్లిమర్ల: నెల్లిమర్ల నియోజక వర్గ వైసీపీ ఎంఎల్‌ఎ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు గురువారం నామినేషన్‌ దాఖలుచేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఎం.నూకరాజుకు మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను బడ్డుకొండ సమర్పించారు.

స్వతంత్ర అభ్యర్థిగా నిమ్మక జయరాజ్‌...

కురుపాం: కురుపాం(షె.తె.)అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మొట్టమొదటి నామినేషన్‌ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్‌ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.వెంకట రమణకు గురువారం ఆయన నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

ఎస్‌.కోటలో రెండు...

శృంగవరపుకోట: శృంగవరపుకోట శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఎస్‌.కోట మండలం శివరామ రాజుపేటకు చెందిన కోట్యాడ లోకాభి రామకోటి స్వతంత్ర అభ్యర్థిగా... కొత్తవ లస మండలం కంటికాపల్లి శివారు కొత్తూరు గ్రామానికి చెందిన యల్ల వెంకటరావు జాతీయ జనసేన పార్టీ తరఫున నామినేషన్లు అందించారని

చెప్పారు.

నేడు కూటమి ఎంపీ అభ్యర్థి కలిశెట్టి నామినేషన్‌

విజయనగరం రూరల్‌: టీడీపీ, జనసేన, బీజెపీ ఉమ్మడి విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని ఎన్నికల విభాగం సెల్‌లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఏకాదశి... మంచి రోజు కావడంతో జ్యోతిష్యులు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం ఆయన నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. విజయనగరం పార్టీ కార్యాలయం (అశోక్‌ బంగ్లా) నుంచి కలెక్టరేట్‌ వరకూ టీడీపీ శ్రేణులతో ర్యాలీగా వెళ్లి... నామినేషన్‌ దాఖలు చేస్తారు.

- విజయనగరం నియోజకవర్గ ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదితి గజపతిరాజు ఈ నెల 24న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉదయం 8 గంటలకు కోట వద్ద నుంచి టీడీపీ శ్రేణులు ర్యాలీగా ఆమె వెంట నడవనున్నారు. మూడులాంతర్ల వద్దనున్న పైడిమాంబ చదురుగుడి వద్ద అదితి గజపతిరాజుతో పాటు, టీడీపీ నాయకులు ఆ రోజు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం నామినేషన్‌ దాఖలు చేస్తారు.

24న కోళ్ల లలిత కుమారి..

శృంగవరపుకోట: శృంగవరపుకోట శాసన సభ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఈనెల 24న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ మేరకు మూహుర్తం నిర్ణయించారు. తొలుత ఈనెల 22న నామినేషన్‌ వేయాలని అనుకున్నారు. ఈ నెల 21న సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. రాత్రి ఇక్కడ బస చేసే అవకాశం ఉంది. మరుసటి రోజు తిరిగి ప్రయాణమయ్యే వరకు చంద్రబాబు నాయుడుతో పాటు ఉండాలి. దీంతో ముహూర్తాన్ని మార్పు చేశారు. వైసీపీ అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం 10.59 గంటలకు నామినేషన్‌ సమర్పించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Apr 19 , 2024 | 12:12 AM