Share News

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

ABN , Publish Date - Jun 10 , 2024 | 12:05 AM

మండలంలోని సింగ రాయి నుంచి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌ అగ్ని ప్రమాదంలో కాలి పోయింది. సింగరాయి నుంచి ఆదివారం ట్రాక్టర్‌తో గడ్డి తర లిస్తున్న నేపథ్యంలో సోంపురం మీసేవ వద్దకు వచ్చే సరికి విద్యు త్‌ తీగకు గడ్డి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గడ్డి ట్రాక్టర్‌ దగ్ధం

వేపాడ, జూన్‌ 9: మండలంలోని సింగ రాయి నుంచి గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్‌ అగ్ని ప్రమాదంలో కాలి పోయింది. సింగరాయి నుంచి ఆదివారం ట్రాక్టర్‌తో గడ్డి తర లిస్తున్న నేపథ్యంలో సోంపురం మీసేవ వద్దకు వచ్చే సరికి విద్యు త్‌ తీగకు గడ్డి తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ట్రాక్టర్‌ డ్రైవర్‌ చాకచక్యంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ట్రాక్టర్‌ నిలిపేసి ఇంజన్‌ తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకు న్నారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ట్రాక్టర్‌పై పరిమితికి మించి గడ్డి తరలించడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వాపోతున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 12:05 AM