ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: జేసీ
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:22 AM
ss

సీతానగరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జేసీ ఎస్‌ఎస్ శోభిక కోరారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యంకొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, జిల్లా పౌర సరఫరాలశాఖ, వ్యవసాయశాఖ సిబ్బంది, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌తో సమీక్షించారు. అనం తరం గుచ్చిమిలో రైతుసేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీచేశారు. సమావేశంలో ఎంపీపీ ప్రతినిధి బి.శ్రీరాము లునాయుడు, టీడీపీ మండలాధ్యక్షులు పి.సత్యంనాయుడు, తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, రైస్ మిల్లర్లు, జిల్లా వ్యవసాయాదికారి రాబర్ట్‌పాల్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఏవో అవినాష్, సీఎస్‌డీటీ రమేష్‌బాబు పాల్గొన్నారు.
ఫ బలిజిపేట, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): దాన్యం కొనుగోలు దగ్గర నుంచి రైతు ఖాతాలో డబ్బులు జమయ్యేవరకు ఏ అధికారైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ శోభిక హెచ్చరించారు. బలిజిపేటలో మిల్లర్లు, క్లస్టర్, మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జేడీ శ్రీనివాసరావు, డీఎం రాబర్ట్‌పాల్, తహసీల్దార్ రత్నకుమారి పాల్గొన్నారు.
ఫ వీరఘట్టం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని సబ్‌కలెక్టర్ యశ్వంత్ కుమార్‌రెడ్డి కోరారు. బుధవారం మండలంలోని తూడిలో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించి, ధాన్యం కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. తుఫాన్‌హెచ్చరికల నేపథ్యంలో రైతులనుంచి ధాన్యాన్ని సేకరించాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఏవో సౌజన్య, లక్ష్మణనాయుడు పాల్గొన్నారు.
ధాన్యం మిల్లులకు తరలించాలి
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మిల్లులకు తరలించాలని ఏవో సౌజన్య తెలిపారు. బుధవారం మండలంలోని అడారు, బిటివాడ గ్రామాల్లోని పంట పొలాల్లో రైతులతో మాట్లాడారు. వర్షాలు పడితే కోతలు నిలిపివేయాలని కోరారు.